కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లా ఇంగ్లిష్ మాట్లాడాలంటే ఈ వీడియో చూడండి!
- ఇంగ్లిష్ భాషా నైపుణ్యం కారణంగా శశిథరూర్‌కు మంచి పాప్యులారిటీ
- ఈ టాలెంట్ వెనకున్న సీక్రెట్ చెప్పిన ఆస్ట్రేలియా ఇంగ్లిష్ టీచర్
- శశి ఫార్ములాను అనుసరిస్తు ఇంగ్లిష్‌పై పట్టుపెంచుకోవచ్చని సూచన
శశిథరూర్ పదాలను పలికే తీరులోనే అందమంతా దాగుందని జే వివరించాడు. ప్రతి పదంలోని సిలబెల్స్‌ను తనదైన శైలిలో ప్రత్యేకంగా ఉచ్చరిస్తూ పలకడం వల్లే శశి మాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. పదంలోని అన్ని సిలబెల్స్‌ను థరూర్ ఒకే రీతిలో పలకరని, సందర్భానుసారం వాటిలో కొన్నింటిని ఒత్తి పలుకుతూ వినసొంపుగా చెబుతారని ఉదాహరణతో పాటు జే చెప్పుకొచ్చారు. శశి భాషానైపుణ్యం వెనక దాగున్న సీక్రెట్స్‌ను అరటిపండు వలిచినట్టు వివరించిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది.