'ది ప్యారడైజ్' చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్.. నాని చెప్పినట్టే జరిగింది!

'ది ప్యారడైజ్' చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్.. నాని చెప్పినట్టే జరిగింది!

The Paradise movie gets A certificate Nani prediction comes true
  • చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
  • దాదాపు మూడు గంటల నిడివి.. 21 చోట్ల మార్పులకు సూచన
  • 'ఏ' సర్టిఫికెట్ వస్తుందని ముందే ఊహించానన్న హీరో నాని
  • సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి రానుంది.

సెన్సార్ బోర్డు వివరాల ప్రకారం, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఖరారు చేశారు. దాదాపు మూడు గంటల నిడివితో వస్తున్న ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా సెన్సార్ బోర్డు పలు మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం 21 చోట్ల కట్స్ లేదా మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ సూచించినట్టు సమాచారం.

ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికెట్ వస్తుందని తాను ముందే ఊహించానని నాని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు రాలేరని అంగీకరిస్తూనే, అన్ని రకాల జానర్లలో సినిమాలు చేయాలనేదే తన ఉద్దేశమని, త్వరలోనే కుటుంబ కథా చిత్రాలు కూడా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

సెన్సార్ పూర్తయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. "సినిమాలోని భావోద్వేగం అందరి కోసం.. కానీ జడల్ క్రూరత్వం మాత్రం పెద్దలకు మాత్రమే" అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్య సినిమా ఎంత రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందో తెలియజేస్తోంది.

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement
Nani
The Paradise Movie
Srikanth Odela
Anirudh Ravichander
Mohan Babu
Telugu Action Drama

More Telugu News