మంత్రి గంగుల కమలాకర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

TS High Court gives relief to Gangula Kamalakar
  • గత ఎన్నికల్లో ఈసీ పరిమితికి మించి గంగుల ఖర్చు చేశారంటూ పిటిషన్
  • గంగులపై పిటిషన్ వేసిన పొన్నం ప్రభాకర్
  • సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి 2018 ఎన్నికల్లో గంగుల ఖర్చు చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో, ఎన్నికల సమయంలో గంగులకు భారీ ఊరట లభించినట్టయింది.
Go Back to Shorts
Gangula Kamalakar
BRS
Congress
Ponnam Prabhakar
TS High Court

More Telugu News