పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 'మొగలి రేకులు' నటుడు
- జనసేన పార్టీలో చేరిన నటుడు సాగర్
- కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్ కల్యాణ్
- సాగర్ రామగుండం జనసేన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం
సాగర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం జనసేన అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలున్నాయి. సాగర్ రామగుండం నియోజకవర్గానికి చెందినవాడే. మరి బీజేపీ రామగుండం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
ఇవాళ సాగర్ మాత్రమే కాదు... హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు, అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు కూడా జనసేనలో చేరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా సాగర్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు తనను విశేషంగా ఆకర్షించాయని తెలిపారు. పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నెరవేరుస్తానని పేర్కొన్నారు.