క్వాంటమ్ నుంచి ఉద్యోగాల వరకు.. ఏపీ భవిష్యత్‌పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు
- 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేశ్
- యువత మార్పు కోరుకుంటోందన్న మంత్రి
- డీఎస్సీపై ఆరోపణలను కొట్టివేసిన లోకేశ్
- అమరావతిలో 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు ప్రస్తావన
- పెట్టుబడులకు 3ఎస్ విధానం అనుసరిస్తున్నామని వివరణ
యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్–2026లో సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
యువతకు ఉద్యోగాలే తొలి లక్ష్యం
యువత తమను అడుగుతున్నది ఒక్కటేనని.. మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటున్నారని లోకేశ్ చెప్పారు. అందుకే ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విద్యా పాఠ్యాంశాలను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నామని, వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు పెంచుతున్నామని చెప్పారు.
జెన్-జీ మార్పు కోరుకుంటోంది
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా యువతలో కొత్త మార్పు కనిపిస్తోందని లోకేశ్ అన్నారు. వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్న యువత ఒక వర్గంగా ముందుకు వస్తోందని చెప్పారు. యువతతో కలిసి సమస్యలకు పరిష్కారాలు వెతకడం తనకు ఉత్సాహాన్నిస్తోందన్నారు.
డీఎస్సీపై ఆరోపణలు.. సర్టిఫికెట్లపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని లోకేశ్ తెలిపారు. క్రీడా కోటాలో ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలే జారీ చేశారని చెప్పారు. ఈ అంశంపై కోర్టు, సీబీఐ దర్యాప్తు కోరినా.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
అమరావతిలో 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్
క్వాంటమ్ టెక్నాలజీ ఊహ కాదని.. ఇది నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీ అని లోకేశ్ అన్నారు. తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పరిశోధనలు, మెటీరియల్ సైన్స్, క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి రంగాల్లో పని చేస్తూ క్వాంటమ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనుకుంటున్నామని చెప్పారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు
విద్యా వ్యవస్థ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మారాలని లోకేశ్ అన్నారు. గత రెండేళ్లలో 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. ఏఐ నుంచి క్వాంటమ్ వరకు భవిష్యత్ టెక్నాలజీలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు కనీసం దశాబ్ద కాలం పడుతుందని పేర్కొన్నారు.
పెట్టుబడులకు ‘3ఎస్’ మంత్రం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ అనే 3ఎస్ విధానాన్ని అనుసరిస్తున్నామని లోకేశ్ చెప్పారు. ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వడం, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పెట్టుబడిదారులకు తెలియజేయడం, ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండేలా చూడటం తమ విధానమన్నారు. వ్యవసాయం నుంచి క్వాంటమ్ వరకు 23 క్లస్టర్లలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.