కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్
- కర్ణాటకకు వెళ్లి రైతులను ఆరా తీద్దాం.. రెడీనా అంటూ ప్రశ్న
- కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మండిపడ్డ తెలంగాణ మంత్రి
- కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళన చేస్తున్నారని వెల్లడి
వారికి డబ్బులు ఇచ్చి తామే తీసుకొచ్చామని కాంగ్రెస్ ఆరోపించడం హాస్యాస్పదమని కేటీఆర్ కొట్టిపారేశారు. అందరమూ కలిసి వెళ్లి కర్ణాటకలో రైతుల పరిస్థితి ఏంటనేది ఆరా తీద్దాం.. మీరు రెడీగా ఉన్నారా? అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మరోవైపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఈమేరకు హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.