రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా
- నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, బీఫామ్ ఇచ్చిన కేసీఆర్
- ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో రాజ్యాంగపదవి నుంచి తప్పుకున్న సునీతా లక్ష్మారెడ్డి
- రాజీనామాను ఆమోదించిన సీఎస్ శాంతికుమారి
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 27న కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో ఆమె ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కొత్త చైర్‌పర్సన్ నియమితులు కానున్నారు.