కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడుకుంటున్నారు: హరీశ్ రావు
- కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందన్న మంత్రి హరీశ్ రావు
- మరికొంతమంది బీజేపీ నేతల్ని కాంగ్రెస్లోకి కిషన్ రెడ్డి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
- కోమటిరెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలైందని వ్యాఖ్య
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజూ మాట్లాడుకొని పని చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి మరికొంతమంది నేతలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందని, దీంతో కాషాయానికి, కాంగ్రెస్కు మధ్య ఉన్న బంధం బట్టబయలు అయిందన్నారు. కేసీఆర్ను తట్టుకోలేక, బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు.