బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
- వాయుగుండంగా మారిన అల్పపీడనం
- ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో కేంద్రీకృతం
- 24 గంటల్లో బాలాసోర్ వద్ద తీరం దాటే అవకాశం
- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో చాంద్‌బలి-దిఘా మధ్య బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.