అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే 'అపూర్వ' .. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

అనుక్షణం ఆసక్తిని రేకెత్తించే 'అపూర్వ' .. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

Apurva Webseries
  • నాయిక ప్రధానమైన సిరీస్ గా 'అపూర్వ'
  • టైటిల్ రోల్ ను పోషించిన తార సుతారియా 
  • అనూహ్యమైన మలుపులతో సాగే కథ 
  • నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్  
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి 'అపూర్వ' వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది. తార సుతారియా - అభిషేక్ బెనర్జీ .. రాజ్ పాల్ యాదవ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, నిఖిల్ నాగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని పెంచిన ఈ సిరీస్, అప్ డేట్స్ తో ఆత్రుతను పెంచుతోంది.  

ఒక సాధారణమైన యువతి తనకి ఎదురైన అనూహ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కొంది? అసాధారణమైన పరిణామాలను ఎలా తట్టుకుని నిలబడగలిగింది? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సిరీస్, నవంబర్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కానుంది. 

ఇండియాలోని అత్యంత ప్రమాదకరమైన లొకేషన్స్ లో ఈ సిరీస్ ను చిత్రీకరించినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. తాజాగా వదిలిన పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తనని వెంటాడుతున్న వారి నుంచి తప్పించుకునే పనిలో ఉన్న నాయిక, అవసరమైతే తిరగబడే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఆడియన్స్ ఎదురుచూసే సిరీస్ ల జాబితాలో ఇప్పుడు ఇది కూడా చేరిపోయినట్టే.
Advertisement
Tara Sutaria
Abhishk Banerjee
Apurva

More Telugu News