చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా

Chandrababu bail Petition postponed to Thursday
  • స్కిల్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్
  • మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు
  • ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన జడ్జి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఏసీబీ కోర్టు తన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆపై కేసు విచారణను ఈ నెల 19 (గురువారం) కి వాయిదా వేస్తున్నట్లు జడ్జి వెల్లడించారు.

‘స్కిల్’ స్కామ్ కేసులో అరెస్టయిన చంద్రబాబు గత నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే, చంద్రబాబు పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు లాయర్లు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మూడు రోజుల క్రితం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే, వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు న్యాయవాదులు కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Go Back to Shorts
Chandrababu
TDP
Skill Development Case
Bail Petition

More Telugu News