Advertisement

ముంబై ఎయిర్‌‌పోర్టులో శ్రుతి హాసన్‌కు చేదు అనుభవం

Man stalks Shruti Haasan at Mumbai airport
  • సైనా వేడుకల్లో పాల్గొని దుబాయ్‌ నుంచి తిరిగొచ్చిన శ్రుతి
  • అభిమానిని అంటు ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి
  • కంగారు పడుతూ కారు ఎక్కి వెళ్లిపోయిన హీరోయిన్‌
దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల కార్యక్రమానికి హాజరై స్వదేశానికి తిరిగొచ్చిన హీరోయిన్ శ్రుతి హాసన్‌ కు ముంబై ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెను వెంబడించి భయపెట్టాడు. అభిమానిని అంటూ శ్రుతి హాసన్ ను ఫాలో చేశాడు. ఈ విషయం గుర్తించిన హీరోయిన్‌ తన ప్రియుడు శాంతనుతో కలిసి వేగంగా నడుచుకుంటూ ముందుకెళ్లింది. మధ్యలో ఆగి ఎవరు నువ్వు? అని ప్రశ్నించడంతో అతను పక్కకి వెళ్లిపోయాడు. కానీ, మళ్లీ ఆమెనే ఫాలో అవుతూ కనిపించాడు. 

పార్కింగ్‌లో ఆమె కారు ఎక్కేంత వరకూ వెంబడించాడు. కాస్త భయపడినట్టు కనిపించిన శ్రుతి హాసన్ నువ్వు ఎవరో నాకు తెలియదు? అంటూ గాబరా పడుతూ కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాగా, టాలీవుడ్‌లో ఈ ఏడాది శ్రుతి రెండు విజయాలు అందుకుంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించిన ‘సలార్‌‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 28నే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
Advertisement
Shruti Haasan
Tollywood
Bollywood
mumbai
airport
fan
scares

More Telugu News