ధైర్యంగా ఉండాలంటూ నారా లోకేశ్ కు పవన్ కల్యాణ్ ఫోన్
- టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ కు తరలింపు
- జగన్ నియంత పాలనపై పోరాడుదామని లోకేశ్ కు పవన్ పిలుపు
- పవన్ కు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేతలని అక్రమ కేసుల్లో అరెస్ట్ చేయించి వేధించడం సైకో జగన్ కి అలవాటుగా మారిందని పవన్ విమర్శించారు. నియంతలా జగన్ సాగిస్తున్న అరాచకాలపై అంతా ఐక్యంగా పోరాడుదామని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.