సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ
- సిట్ కార్యాలయంలోకి భువనేశ్వరి, నారా లోకేశ్
- హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన బాలకృష్ణ, బ్రాహ్మణి
- ఇన్నాళ్లు ఛార్జీషీట్ వేయకుండా ఎందుకు ఊరుకున్నారని బాలకృష్ణ ప్రశ్న
విజయవాడ బయలుదేరిన బాలకృష్ణ, బ్రాహ్మణి
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... ఇన్నాళ్లు ఛార్జిషీట్ వేయకుండా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం తాను కూడా ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేశానన్నారు. ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకే ఈ కేసును బయటకు తీశారన్నారు. ఆయనను జైల్లో పెట్టే ఆలోచన తప్ప మరొకటి లేదన్నారు.