నీట్ లీకేజీ రచ్చ.. ప్రధాని మోదీ హామీని తిరస్కరించిన 'సీజేపీ'!
- నీట్ అక్రమాలపై ప్రధాని మోదీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ప్రకటన
- ప్రధాని నిర్ణయాన్ని తోసిపుచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ
- విద్యామంత్రి రాజీనామా, తటస్థ వేదికపై చర్చలకే పట్టు
- నేడు దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు
- ఆందోళనకారులకు మద్దతు తెలిపిన సినీ స్టార్లు
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాలుస్తోంది. పరీక్షల వ్యవస్థపై చెదిరిపోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే, ప్రధాని హామీలను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఖండించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ప్రభుత్వం నిర్వహించే అధికారిక ప్రదేశాల్లో కాకుండా జంతర్ మంతర్ లేదా ఏదైనా తటస్థ ప్రాంతంలోనే చర్చలు జరగాలని సీజేపీ కఠిన కండిషన్లు పెట్టింది. ఈ క్రమంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ ఆందోళనల్లో హింస చెలరేగితే బాధ్యులైన వారి పాస్‌పోర్టులను రద్దు చేయడం సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, విద్యార్థులు లేవనెత్తుతున్న ఆరోపణల నిజాయతీని ప్రశ్నిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇక ఈ సున్నితమైన అంశంపై సల్మాన్ ఖాన్, అలియా భట్, దిల్జీత్ దొసాంజ్, కమల్ హాసన్, ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి వంటి అంతర్జాతీయ, జాతీయ స్థాయి సినీ తారలు స్పందించారు.