లోకేశ్! మీ నాన్నను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?: మంత్రి రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోకేశ్! మీ నాన్నను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?: మంత్రి రోజా

Minister Roja counter to Nara Lokesh
  • పిచ్చోడు లండన్‌కు... మంచోడు జైలుకు అంటూ లోకేశ్ ట్వీట్
  • చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని రోజా కౌంటర్
  • చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందని వ్యాఖ్య
  • మీ నాన్న నిప్పు అయితే కనుక విచారణ జరుపుకోమని ధైర్యంగా చెప్పాలని సవాల్
'పిచ్చోడు లండన్‌కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు.

సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రోజా కౌంటర్ ఇచ్చారు. 'ఓ పిల్ల సైకో లోకేశ్... మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు' అంటూ విమర్శలు గుప్పించారు. మీ నాన్న మంచోడు కాదని, సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడని తెలుసుకో అన్నారు. ఇలాంటి కరప్షన్ కింగ్‌ను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఓ పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే కనుక ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండని ధైర్యంగా చెప్పు అంటూ లోకేశ్‌కు సవాల్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబును ఏ దేవుడూ కాపాడలేడని, మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి సంతోషిస్తుందన్నారు. బైబై తుప్పు.. బైబై పప్పు అంటూ ట్వీట్‌ను ముగించారు.
Advertisement
Roja
Nara Lokesh
Chandrababu
Andhra Pradesh

More Telugu News