I.N.D.I.A. కూటమి రెండు సమావేశాలతో గ్యాస్ ధర రూ.200 తగ్గింది!: మమతా బెనర్జీ
- సిలిండర్ గ్యాస్ ధరను రూ.200 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
- ఉజ్వల పథకం కింద రూ.400 తగ్గనున్న భారం
- ఇదే I.N.D.I.A. దమ్ము అంటూ గ్యాస్ తగ్గింపుపై మమతా బెనర్జీ ట్వీట్
రెండు నెలల కాలంలో I.N.D.I.A. కూటమి కేవలం రెండు సమావేశాలు నిర్వహించిందని, ఈ రెండు సమావేశాల దెబ్బతో కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించిందన్నారు. ఇదే I.N.D.I.A. దమ్ము అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు.