గుంటూరు కారంపై వస్తున్న పుకార్లకు మహేశ్ బాబు చెక్
- వచ్చే సంక్రాంతికే విడుదల అవుతుందన్న సూపర్ స్టార్
- త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
- హీరోయిన్లుగా నటిస్తున్న శ్రీలీల, మీనాక్షి చౌదరి
నిన్న రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ ‘గుంటూరు కారం’ గురించి మాట్లాడారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందన్నారు. ఆ రోజు ప్రేక్షకులంతా ఆనందంగా ఉంటారని స్పష్టం చేశారు. దాంతో, సినిమాపై పుకార్లు, అనుమానాలకు తెర పడింది. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.