ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది, చాలా ఇబ్బంది పడ్డా: దుల్కర్ సల్మాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది, చాలా ఇబ్బంది పడ్డా: దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan recalls elder women grabbing and squeezing his backside while taking pictures
  • ‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తరువాత తనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందన్న దుల్కర్ సల్మాన్
  • అభిమానులతో ఇబ్బందులూ కలుగుతుంటాయని వెల్లడి
  • కొందరు తన బుగ్గపై ముద్దుపెట్టే ప్రయత్నం చేస్తారని, ఇది ఆశ్చర్యం కలిగిస్తుంటుందని వ్యాఖ్య
  • ఓ పెద్దావిడ స్టేజీపైనే తనను అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డానన్న నటుడు
నటులను తమ అభిమానంతో సినీతారలుగా మార్చి అందలం ఎక్కించే ప్రేక్షకులు వారిని అప్పుడప్పుడూ ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఆయన చెప్పుకొచ్చాడు. 

‘‘ ‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తరువాత నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సాధారణంగా నాకు అబ్బాయిల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. నేనూ వాళ్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటా. అయితే, అభిమానుల కారణంగా గతంలో కొన్ని సార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంటుంది. గతంలో ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది. ఎంతో ఇబ్బందిపడ్డా’’ అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు. 

తనకు 28 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యిందని దుల్కర్ సల్మాన్ తెలిపాడు. ‘‘నా భార్య అమాల్ సోఫియా, నేను చిన్నప్పుడు ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. ఆమె నా జీవితం, నా కుటుంబంలో భాగమని తనను కలిసినప్పుడే నాకు అర్థమైంది. అంతకుమునుపు ఏ అమ్మాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. పెళ్లి, కెరీర్ నాకు ఒకే సమయంలో మొదలయ్యాయి. వివాహం జరిగిన కొద్ది రోజులకే రెండో సినిమా షూట్‌లో పాల్గొన్నా. నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏకాస్త సమయం దొరికినా తనతో గడపడానికే ఇష్టపడతా’’ అని చెప్పుకొచ్చారు. 
Advertisement
Dulquer Salmaan
Tollywood
Mollywood

More Telugu News