Dulquer Salmaan: నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కి దగ్గరలో 'గన్స్ అండ్ గులాబ్స్'

Guns And Gulaabs Streaming date confirmed
షార్ట్స్‌లో చూడండి
ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది .. వరుస సినిమాలతో బిజీగా ఉండే స్టార్ హీరోలు సైతం వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టాడు. ఆయన మొదటి వెబ్ సిరీస్ గా రూపొందిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఈ నెల 18వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది.

ఇంతకుముందు 'ది ఫ్యామిలీ మేన్' .. 'ఫర్జీ' వంటి హిట్ సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే, ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. గులాబీ గంజ్ అనే ప్రాంతంలో గ్యాంగ్ స్టర్స్ కి .. పోలీస్ ఆఫీసర్స్ కి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇందులో కామెడీ పాళ్లు కూడా ఎక్కువగానే కనిపించనున్నాయి. 

దుల్కర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సిరీస్ లో రాజ్ కుమార్ రావ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఆదర్శ్ గౌరవ్ - గుల్షన్ దేవయ్య ముఖ్యమైన పాత్రలను పోషించారు. రాజ్ అండ్ డీకే నుంచి వస్తున్న ఈ సిరీస్, నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పై ఏ రేంజ్ లో పరుగులు పెడుతుందనేది చూడాలి.
Go Back to Shorts
Dulquer Salmaan
Raj Kumar Rao
Raj And Dk
Guns and Gulaabs

More Telugu News