బీజేపీ ఈవీఎం హ్యాకింగ్ ప్రయత్నాలపై ఆధారాలున్నాయి: మమతా బెనర్జీ
- I.N.D.I.A. గెలిచాక దేశాన్ని కాపాడుతుందన్న బెంగాల్ సీఎం
- మతపర ఉద్రిక్తత, నిరుద్యోగం నుండి ప్రతిపక్ష కూటమి కాపాడుతుందని వ్యాఖ్య
- బీజేపీ హ్యాకింగ్‌పై మరిన్ని ఆధారాల సేకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి
ఈ మేరకు మమత రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గెలవాలనే దానిపై బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం తెలిసిందన్నారు. దేశాన్ని కాపాడేది I.N.D.I.A. మాత్రమేనని ఆమె అన్నారు.