'బేబి' దర్శకుడి చేతులమీదుగా 'మదిలో మది' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బేబి' దర్శకుడి చేతులమీదుగా 'మదిలో మది' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!

Madilo Madi movie first look poster release
  • మరో ప్రేమకథగా రూపొందిన 'మదిలో మది'
  • నూతన నటీనటులతో నిర్మితమైన సినిమా 
  • దర్శకుడిగా ప్రకాశ్ పల్లా పరిచయం 
  • ఆగస్టు 18వ తేదీన సినిమా విడుదల
ప్రేమకథా చిత్రాలకు జనాల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. రీసెంట్‌గా 'బేబి' సినిమానే దానికి నిదర్శనం. యువతను ఆకట్టుకునే కథ, కథనాలతో సాయి రాజేష్ తీసిన 'బేబి' బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాంటి కోవలోకి చెందిన మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా 'మదిలో మది' అనే చిత్రం రాబోతోంది. జై.. శీను .. స్వీటీ .. సిరి రావులచారి .. సునీత ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ పల్ల దర్శకత్వం వహించాడు.  నేముకూరి జయకుమార్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బేబి మూవీ డైరెక్టర్ సాయిరాజేష్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  ‘మదిలో మది' సినిమా ఆగస్ట్ 18న విడుదల కాబోతోంది. నేను ట్రైలర్‌ను చూశాను .. అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ ’ అని అన్నారు.

ఆ మధ్య ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్‌ విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే 'బలగం' మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా లాంచ్ అయిన టైటిల్ టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు షారుఖ్‌ సంగీతం, క్రాంతి నీల - రాజేష్‌ మధుమాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement
Jai
Srinu
Sweety
Madilo Madi Movie

More Telugu News