మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టేది అప్పుడేనట!
- షూటింగు దశలో ఉన్న 'గుంటూరు కారం'
- అత్యధిక పారితోషికం అందుకున్న మహేశ్
- కథానాయికలుగా శ్రీలీల - మీనాక్షి చౌదరి
- జనవరి 12వ తేదీన విడుదల
- ఆగస్టు 9న రాజమౌళితో ప్రాజెక్టు ప్రారంభమనే టాక్
ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం హల్ చల్ చేస్తోంది. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే. ఆ రోజున ఈ సినిమాను లాంఛనంగా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. అంటే .. ఆ రోజున పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెబుతున్నారు. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన కెరియర్లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకున్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. శ్రీలీల - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా, జనవరి 12వ తేదీన విడుదల కానుంది.