అమెజాన్ ప్రైమ్ లో జాన్వీ కపూర్ 'బవాల్'

Bawaal Movie OTT release date confirmed
  • వరుణ్ ధావన్ హీరోగా రూపొందిన 'బవాల్'
  • కథానాయికగా సందడి చేయనున్న జాన్వీ కపూర్ 
  • ఈ నెల 21వ తేదీన నేరుగా ఓటీటీకి వస్తున్న సినిమా 
  • తానేమీ నిరాశ చెందడం లేదన్న జాన్వీ  
వరుణ్ ధావన్ - జాన్వీ కపూర్ జంటగా 'బవాల్' సినిమా రూపొందింది. సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ట్రైలర్ ను వదిలారు కూడా.

ముందుగా ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఓటీటీ నుంచి భారీ ఆఫర్ రావడంతో, ఓటీటీ వైపు నిర్మాతలు మొగ్గు చూపారట. ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ సినిమాలు ఓటీటీల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమా అయినా థియేటర్స్ లో పడుతుందని ఆమె భావించింది. కానీ ఇది కూడా ఓటీటీ బాట పట్టడం విశేషం. 

అయితే ఈ విషయంలో తనకి ఎలాంటి నిరాశ లేదని జాన్వీ చెప్పింది. ఓటీటీలో తన సినిమా నేరుగా రిలీజ్ అవుతున్నందుకు తానేమీ బాధపడటం లేదనీ, కోట్లాదిమందికి చేరువ కావడమే సినిమా అంతిమ లక్ష్యమని పేర్కొంది. ఓటీటీ ద్వారా ఈ సినిమా కోట్లాది మందికి చేరితే, తనకి అది సంతోషాన్ని కలిగించే విషయమేనని చెప్పుకొచ్చింది. దాంతో ఆమె అభిమానులు ఇప్పుడు 'దేవర' పైనే దృష్టి పెట్టారు.

Go Back to Shorts
Janhvi Kapoor
Varun Dhawan
Bawaal Movie

More Telugu News