ప్రధాన మంత్రి ఆదేశంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్
- రెండు రోజుల క్రితం ఆటకు గుడ్ బై చెప్పిన తమీమ్ ఇక్బాల్
- తన ఇంటికి ఆహ్వానించి నచ్చజెప్పిన ప్రధాని షేక్ హసీనా
- ప్రధాని ఆదేశంతో రిటైర్మెంట్ ను వెనక్కితీసుకున్నట్టు తెలిపిన తమీమ్
నిన్న ఆమెతో భేటీ అయిన తర్వాత తమీమ్ రిటైర్మెంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించాడు. నెలన్నరపాటు విశ్రాంతి తీసుకుని తిరిగి ఆడతానని తెలిపాడు. స్వయంగా ప్రధానమంత్రి తనను వారి ఇంటికి ఆహ్వానించారని, సుదీర్ఘమైన చర్చ తర్వాత తిరిగి క్రికెట్ ఆడాలని ఆదేశించారని చెప్పాడు. దాంతో, కాదనలేకపోయానని తెలిపాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా, బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ కూడా ఒత్తిడి చేయడంతో తిరిగి ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.