ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి గౌరవ అతిథిగా ప్రధాని మోదీ
- జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం
- పారిస్ లో బాస్టిల్ డే ఉత్సవాలు
- ప్రధాని మోదీని ఆహ్వానించిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్
- ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా భారత రాఫెల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్ నేషనల్ డే సందర్భంగా పారిస్ లోని చాంప్స్ ఎలిసిస్ లో బాస్టిల్ డే ఫ్లై పాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ కు చెందిన 3 రాఫెల్ యుద్ధ విమానాలు కూడా పాల్గొంటుండడం విశేషం.
రాఫెల్ యుద్ధ విమానాలను భారత్... ఫ్రాన్స్ నుంచే కొనుగోలు చేసింది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగే సైనిక కవాతులో ఈ మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.