మళ్లీ బ్యాట్ పడుతున్న అంబటి రాయుడు

Ambati Rayudu to play for Texas Super Kings after retirement from Indian cricket
  • అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ లో బరిలోకి
  • టెక్సాస్ సూపర్ కింగ్స్ కు ఆడనున్న రాయుడు
  • ఇటీవలే కెరీర్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలోకి వస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు అమెరికాలో జులైలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్ లో ఆడనున్నాడు. ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరఫున అతను బరిలోకి దిగనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో ట్రోఫీ సొంతం చేసుకోవడంలో భాగమైన రాయుడు ఆ ఫైనల్ ముగిసిన వెంటనే అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో, విదేశీ లీగ్‌లో ఆడేందుకు అర్హత సాధించాడు. 

కాగా, సీఎస్కే ఆటగాళ్లయిన డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే కూడా మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సాస్ జట్టు తరఫున ఆడనున్నారు. ఈ జట్టుకు స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. డేవిడ్ మిల్లర్, డేనియల్ సామ్స్ వంటి ఐపీఎల్ ఆటగాళ్లు బరిలో ఉన్న మేజర్ లీగ్ క్రికెట్ లో ఆరు జట్లు పోటీ పడనున్నాయి. జులై 14న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ తో తలపడనుంది.
Go Back to Shorts
Ambati Rayudu
Team India
ipl
MLC
America

More Telugu News