నిజాలు మాట్లాడితే చాలు... వైసీపీ నానీలు బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు: విష్ణువర్ధన్ రెడ్డి
- శ్రీకాళహస్తి సభలో వైసీపీ సర్కారుపై జేపీ నడ్డా విమర్శలు
- ప్రెస్ మీట్ పెట్టి రిప్లయ్ ఇచ్చిన పేర్ని నాని
- నోరు చేసుకోవడానికి తప్ప దేనికీ పనికిరారన్న విష్ణువర్ధన్ రెడ్డి
ఈ నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. నిజాలు మాట్లాడితే చాలు... బూతులతో కరిచేందుకు పరుగున వచ్చేస్తారు వైసీపీ నానీలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"మీరు పనికిమాలిన వాళ్లనే కదా మిమ్మల్ని మంత్రి పదవుల నుంచి పీకేసింది? నోరు చేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరారనే కదా మిమ్మల్ని షెడ్డుకు పంపింది? ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మీరు కూడా మాట్లాడేవారేనా? ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడే ఏముంది... ముందుంది ముసళ్ల పండగ" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.