నేడే టీమిండియా ఆటగాడు రుతురాజ్​ పెళ్లి.. కాబోయే భార్య కూడా క్రికెటరే!

నేడే టీమిండియా ఆటగాడు రుతురాజ్​ పెళ్లి.. కాబోయే భార్య కూడా క్రికెటరే!

Indian cricketer Ruturaj Gaikwad Wedding today
  • ప్రియురాలు ఉత్కర్షను పెళ్లి చేసుకోనున్న రుతురాజ్ గైక్వాడ్
  • ఐపీఎల్‌16లో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్
  • దేశవాళీ క్రికెట్‌ లో మహారాష్ట్ర మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్కర్ష
టీమిండియా క్రికెటర్, ఐపీఎల్16 చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ రోజు తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ జంట మెహిందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబ‌రాల తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 24 ఏళ్ల ఉత్కర్ష కూడా క్రికెటర్‌ కావడం విశేషం. దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర మహిళల జట్టు తరఫున ఆల్‌రౌండర్‌గా ప్రాతినిధ్యం వహించింది. చ‌దువు కార‌ణంగా కొంత‌కాలంగా ఆమె క్రికెట్‌కు దూరంగా ఉంటోంది. 

ప్ర‌స్తుతం పూణెలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీష‌న్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సిస్తోంది. ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌కు హాజరైన ఉత్క‌ర్ష.. ధోనీ తో దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఫైనల్ ముగిసిన తర్వాత గ్రౌండ్‌ లో మహీ పాదాలకు ఆమె నమస్కరించింది. కాగా, పెళ్లి కారణంగా ఈనెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జ‌రుగ‌నున్న డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. ఈ మ్యాచ్ లో తలపడే భారత జట్టులో రుతురాజ్ స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికయ్యాడు. అతని స్థానంలో సెలెక్ల‌ర్లు యువ బ్యాటర్ య‌శ‌స్వి జైస్వాల్ ను తీసుకున్నారు.
Advertisement
cricketer
Ruturaj Gaikwad
Team India
csk
ipl 2023
wedding

More Telugu News