రాజకీయాల కోసం కాపులను ఎన్నటికీ విమర్శించను: కొడాలి నాని
- వైసీపీ పాలనకు నాలుగేళ్లు
- గుడివాడలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన కొడాలి నాని
- తన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- తన 20 ఏళ్ల రాజకీయ జీవిత విజయాల్లో సగభాగం కాపులదేనని వివరణ
కాపులపై తాను వ్యాఖ్యలు చేసినట్టు దుమారం రేగుతుండడంపైనా కొడాలి నాని స్పందించారు. రాజకీయాల కోసం కాపులను ఎప్పటికీ విమర్శించబోనని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తన విజయాల్లో కాపులదే సగభాగం అని వివరణ ఇచ్చారు. వంగవీటి రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనలేదని వెల్లడించారు.
రాజమండ్రి మహానాడు వేదికపై ఎన్టీఆర్ ఫొటో పక్కన కొందరి ఫొటోలు పెట్టడంపైనే తాను మాట్లాడానని, టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని కాపు సోదరులెవరూ నమ్మలేదని కొడాలి నాని తెలిపారు. తాను మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు ఎడిట్ చేసి వదిలారని ఆరోపించారు.