ఇంటి ముందు వాహనాల పార్కింగ్‌కు ఏటా రూ. 25,000.. బెంగళూరులో కొత్త రూల్స్!
- ఇంటి ముందు వీధుల్లో పార్కింగ్ కోసం ఏటా రూ. 25,000 వరకు రుసుము
- రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్ ఉన్నవారికే వీధుల్లో పార్కింగ్‌కు అనుమతి
- భవనానికి సొంత పార్కింగ్ ఉంటేనే వీధి పార్కింగ్ పర్మిట్ జారీ
- ట్రాఫిక్, పాదచారుల సమస్యల పరిష్కారానికి కొత్త నిబంధనల ప్రతిపాదన
- పర్మిట్ లేకుండా పార్క్ చేస్తే జరిమానాలు విధించే అవకాశం
బెంగళూరు నగరంలో నివసించే వారికి ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. తమ ఇళ్ల ముందు పబ్లిక్ రోడ్లపై వాహనాలు పార్క్ చేయాలంటే ఇకపై ఏటా వేలల్లో రుసుము చెల్లించాల్సి రావచ్చు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) రూపొందించిన 'పార్కింగ్ రూల్స్-2026' ముసాయిదా ప్రకారం.. వాహనదారులు ఏటా రూ. 25,000 వరకు చెల్లించి 'రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్' పొందడం తప్పనిసరి కానుంది.
ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం.. వాహనాల రకాన్ని బట్టి వార్షిక పర్మిట్ ఫీజులు నిర్ణయించారు. హ్యాచ్‌బ్యాక్ కార్లకు రూ. 15,000, సెడాన్‌లకు రూ. 20,000, ఎస్‌యూవీలకు రూ. 25,000గా ప్రతిపాదించారు. అయితే, ఈ పర్మిట్ పొందడానికి ఒక కీలకమైన, కఠినమైన నిబంధనను చేర్చారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం కనీస పార్కింగ్ సౌకర్యం ఉన్న భవనాల్లో నివసించే వారికి మాత్రమే ఈ పర్మిట్ జారీ చేస్తారు. అంటే.. తమ అపార్ట్‌మెంట్ లేదా ఇంటికి చట్ట ప్రకారం సొంత పార్కింగ్ స్థలం లేని నివాసితులు, వీధుల్లో పార్కింగ్ చేసుకునేందుకు పర్మిట్ పొందలేరు.
నగరంలో అడ్డదిడ్డంగా రోడ్లపైనే వాహనాలు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను ప్రతిపాదించారు. చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా రోడ్లపై వాహనాలు నిలిపితే దానిని చట్టవిరుద్ధమైన పార్కింగ్‌గా పరిగణించి, జరిమానాలు విధిస్తారు. ఈ పర్మిట్‌ను ఒక నిర్దిష్ఠ వ్యక్తికి, వాహనానికి మాత్రమే జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తుదారు అదే ప్రాంతంలో నివసిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే పునరుద్ధరిస్తారు.
ఈ పర్మిట్ కేవలం ఇంటికి నడిచి వెళ్లే దూరంలో, పార్కింగ్ కోసం నిర్దేశించిన రోడ్లలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది. వేరే ప్రాంతంలో పార్క్ చేస్తే నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. అంతేకాకుండా ఆర్టీరియల్, సబ్-ఆర్టీరియల్ రోడ్లలో కాకుండా ఇతర రోడ్లపై మాత్రమే పార్కింగ్‌కు అనుమతి ఉంటుంది. అక్కడ కూడా ట్రాఫిక్ కోసం కనీసం 6 మీటర్ల రోడ్డు, పాదచారుల కోసం ఇరువైపులా 1.8 మీటర్ల ఫుట్‌పాత్ ఖాళీగా ఉంచాలనే నిబంధన విధించారు. ప్రస్తుతం ఈ నిబంధనలు ముసాయిదా దశలోనే ఉండగా, త్వరలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.