NTR30: రేపు ఎన్టీఆర్30 నుంచి ఫస్ట్ లుక్ విడుదల

First look from NTR30 will be out tomorrow
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఎన్టీఆర్30. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్30 అనే వర్కింగ్ టైటిల్ తోనే చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం రేపు (మే 19) అభిమానులకు అదిరిపోయే కానుక లభించనుంది. ఈ చిత్రం నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను శుక్రవారం రాత్రి 7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. 

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పలు పోస్టర్ లు వచ్చినా ఎన్టీఆర్ ఫ్రంట్ లుక్ చూపించలేదు. మొత్తానికి ఊర మాస్ సినిమా అని తెలుస్తూనే ఉన్నా, ఎన్టీఆర్ రౌద్ర రూపాన్ని అభిమానులు రేపు వీక్షించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. అతని కంటే అతని కథ మరింత భయానకం అంటూ ఎన్టీఆర్30పై మరిన్ని అంచనాలను పెంచేసింది. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయిక. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడు అని తెలుస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Go Back to Shorts
NTR30
First Look
NTR
Koratala Siva
Tollywood

More Telugu News