పనీపాటా లేనివాళ్లు ఏదో అంటూనే ఉంటారు .. నేను పట్టించుకోను: నిహారిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పనీపాటా లేనివాళ్లు ఏదో అంటూనే ఉంటారు .. నేను పట్టించుకోను: నిహారిక

Niharika Interview
  • నిహారిక ప్రధాన పాత్రగా రూపొందిన 'డెడ్ పిక్సెల్స్'
  • ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న హాట్ స్టార్ 
  • ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నిహారిక
నిహారిక ప్రధానమైన పాత్రగా 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్ రూపొందింది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక బిజీగా ఉంది. తాజాగా ఆమె తనపై వచ్చే కామెంట్స్ ను గురించి ప్రస్తావించింది. 

"నా కెరియర్ స్టార్టింగులో నాపై వచ్చే కామెంట్స్ ను పట్టించుకుని ఫీల్ అయ్యేదానిని .. ఆ తరువాత వాటిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టాను. ఒకసారి ఒక ఆడియో లాంచ్ లో నేను ఒక స్టేజ్ పై కంఫర్టబుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో కాలుపై కాలు వేసుకుని కూర్చుంటే, నాకు చాలా పొగరు అంటూ రాసుకొచ్చారు" అని అంది. 

"పొద్దునే చీరకట్టుకుని .. పూజ చేసుకుని మఠం వేసుకుని కూర్చున్నా, ఏదో ఒక కామెంట్ చేసేవాళ్లు వందమంది ఉంటారు. ఎందుకంటే వాళ్లకి పనీపాటా లేదు. అలాంటి కామెంట్స్ చూడటం .. బీపీలు తెచ్చుకోవడం అవసరమా? అందువల్లనే నేను కామెంట్స్ చూడను .. చూసినా పట్టించుకోను" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement
Niharika
Akshay
Bhavana
Dead Pixels

More Telugu News