ఇది బలవంతులపై బలహీనుల విజయం: రాహుల్ గాంధీ
- ఘన విజయం అందించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్
- ద్వేషంతో కాకుండా ప్రేమతో ఎన్నికలను ఎదుర్కొన్నామని వ్యాఖ్య
- మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తామని వెల్లడి
కర్ణాటకలో సాధించిన విజయం ప్రతి ఒక్కరిదని చెప్పారు. విజయానికి కృషి చేసిన నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కర్ణాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తామని చెప్పారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.