డీకే, సిద్దూ, బొమ్మై గెలుపు.. శెట్టార్, బి.శ్రీరాములు ఓటమి

డీకే, సిద్దూ, బొమ్మై గెలుపు.. శెట్టార్, బి.శ్రీరాములు ఓటమి

Karnataka election results
  • ఒక్కొక్కటిగా వెలువడుతున్న కర్ణాటక ఫలితాలు
  • కనకపురి నుంచి డీకే శివకుమార్ గెలుపు
  • బళ్లారి రూరల్ లో బి.శ్రీరాములుకు పరాభవం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పలువురు కీలక నేతలు విజయం సాధించగా... మరికొందరు ఊహించని విధంగా పరాజయం పాలవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురి నియోజకవర్గం నుంచి జయకేతనం ఎగురవేశారు. 

బళ్లారి రూరల్ స్థానం నుంచి బి.శ్రీరాములు ఓటమి పాలయ్యారు. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్ ఓడిపోయారు. మరోవైపు రేపు ఉదయం బెంగళూరులో సీఎల్పీ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు వెంటనే బెంగళూరుకు రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.
Advertisement
Karnataka
Election Results

More Telugu News