కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఇంట విషాదం
- సిద్ధరామయ్య సోదరి భర్త రామే గౌడ మృతి
- ఈ రోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురైన రామేగౌడ
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
ఈ రోజు ఆయన బావ కన్నుమూశారు. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామే గౌడ (69) ఆకస్మికంగా మరణించారు. రామే గౌడ ఈ ఉదయం అస్వస్థతకు గురికావడంతో నగరంలోని జేఎస్‌ఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం హత్తూరులో అంత్యక్రియలు జరగనున్నాయి.