క్రికెట్ బెట్టింగ్ కోసం అప్పు.. తీర్చలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- అనకాపల్లి జిల్లా దిబ్బలపాలెంలో ఘటన
- అప్పు చేసి ఐపీఎల్లో బెట్టింగులు
- ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ మృతి
క్రికెట్ బెట్టింగ్లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఐపీఎల్లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు తాగి మధుకుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.