దూసుకుపోతున్న 'విరూపాక్ష' .. 4 రోజుల్లో 50 కోట్ల క్లబ్ లోకి!
- ఈ నెల 21న రిలీజైన 'విరూపాక్ష'
- తొలి రోజున 12 కోట్ల గ్రాస్ వసూళ్లు
- రెండో రోజుతో లభించిన 28 కోట్ల గ్రాస్
- మూడో రోజుతో కలుపుకుని 44 కోట్ల గ్రాస్
- నాల్గో రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ
సాయితేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాలలోను తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. కథాకథనాల పరంగా .. నిర్మాణ విలువల పరంగా ఈ సినిమా మంచి మార్కులను కొట్టేసింది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 12 కోట్లు .. రెండో రోజు 28 కోట్లు .. మూడో రోజు 44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, నాల్గో రోజుతో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సాయితేజ్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా .. ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలవడం విశేషం
.