Tollywood: పోసాని కృష్ణమురళీకి మూడోసారి కరోనా

Posani Krishna Murali again tests corona
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ నటుడు, ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణ మురళీకి మరోసారి కరోనా సోకింది. మూడోసారి కరోనా బారిన పడి ఆయన ఆసుపత్రిలో చేరారు. పూణెలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని పోసాని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో, పోసాని ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. 

మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మాస్కులు ధరించడంతో పాటు కరోనాకు సంబంధించిన పలు నిబంధనలను పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.
Go Back to Shorts
Tollywood
Posani Krishna Murali
Corona Virus
Hospital

More Telugu News