ఎన్టీఆర్30లో తారక్ డబుల్ ధమాకా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్30లో తారక్ డబుల్ ధమాకా!

Tarak to play duel role in NTR 30
  • కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తారక్
  • హీరోయిన గా జాన్వీ కపూర్
  • హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి 
ఆర్ఆర్ఆర్ అఖండ విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ అందించిన శివ చేతిలో తన 30వ సినిమా బాధ్యతలు పెట్టాడు తారక్. ఆచార్య తర్వాత కొరటాల సైతం ఈ చిత్రంపైనే ఫోకస్ పెట్టాడు. హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. దాంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఆదివారంతో తొలి షెడ్యూల్‌ పూర్తయిందని సమాచారం. తర్వాతి షెడ్యూల్‌ గోవాలో ఉంటుందని తెలుస్తోంది. 

అయితే, ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ఒకటి బయటికి వచ్చింది. ఇందులో తారక్‌ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. సముద్ర తీరప్రాంత ప్రజల నేపథ్యంలో సాగే కథానుగుణంగా తారక్‌ తండ్రీ కొడుకల పాత్రల్లో కనిపిస్తారని టాలీవుడ్ సమాచారం. దీని గురించి చిత్ర బృందం అధికారిక ప్రకటన అయితే చేయలేదు. తారక్ కు ద్విపాత్రాభినయం కొత్తేం కాదు. ఆంధ్రావాలా, అదుర్స్‌ చిత్రాల్లో రెండు పాత్రల్లో  ‘జై లవకుశ’లో ఏకంగా మూడు పాత్రల్లో నటించి మెప్పించారు. కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్‌, కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Advertisement
NTR 30
Tollywood
Tarak
Koratala Siva

More Telugu News