రవితేజ రావణాసుర తొలి రోజు వసూళ్లు అంతేనా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ రావణాసుర తొలి రోజు వసూళ్లు అంతేనా!

Ravanasura box office collection Day 1
  • దేశ వ్యాప్తంగా రూ. 5.5 కోట్లు రాబట్టిన నూతన చిత్రం
  • నాని దసరా తొమ్మిదో రోజు వసూళ్ల కంటే తక్కువే
  • సుదీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర శుక్రవారం (ఏప్రిల్ 7) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. తన కెరీర్లోనే మొదటిసారిగా రవితేజ సరికొత్త క్యారెక్టర్ లో కనిపించారు. భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ చిత్రానికి ఘనమైన ఓపెనింగ్ రాలేదు. దసరా మినహా మరే పెద్ద చిత్రంతోనూ పోటీ లేకపోయినా ఆకట్టుకోలేకపోయింది. అన్ని భాషల్లో కలిపి తొలి రోజు చిత్రం ఐదున్నర కోట్లు రాబట్టింది. నాని హీరోగా నటించిన దసరా తొమ్మిదో రోజు కలెక్షన్లను కూడా అధిగమించలేకపోవడం గమనార్హం. 

రవితేజ గత సినిమాలు ధమాకా రూ. 9.48 కోట్లు, కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్ల మేర ఓపెనింగ్ వసూళ్లను సాధించాయి. ఈ లెక్కన రావణాసురకు మంచి ఆరంభం దక్కలేదని చెప్పాలి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.25 కోట్ల వసూళ్లు రావాలి. అయితే, వారాంతంలో వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ను అభిషేక్ నామా నిర్మించారు. అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు.
Advertisement
Ravi Teja
Ravanasura

More Telugu News