నిన్న తెలుగు.. ఇవాళ హిందీ.. వాట్సాప్ లో ప్రత్యక్షమైన పదో తరగతి ప్రశ్నపత్రం
- ఉదయం 9:30 గంటల నుంచే వాట్సాప్ లో చక్కర్లు
- వరంగల్ లో హిందీ పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం
- ఆందోళనలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే, పేపర్ నిజంగానే లీక్ అయిందా.. లేక ఆకతాయిలు చేసిన పనా అనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేపర్ లీక్ వార్తలను జిల్లా విద్యాశాఖ అధికారులు కొట్టిపడేశారు. లీక్ విషయంపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.