భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్ .. గ్రేస్ అదిరిపోయింది
- బావమరిది పెళ్లి వేడుకలో సందడి చేసిన రోహిత్
- హుషారైన స్టెప్పులు వేసిన రోహిత్ దంపతులు
- పెళ్లి వేడుక కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న రోహిత్
కునాల్ సజ్దే పెళ్లి పనులు దగ్గరుండి చూసుకున్న రోహిత్ దంపతులు.. వేడుకల్లో భాగంగా హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ డ్యాన్స్ అదిరిపోయిందని, అతని గ్రేస్ చాలా బాగుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా, శుక్రవారం ముంబైలో జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మూడు వన్డేల సిరీస్ లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం వైజాగ్ లో జరిగే రెండో వన్డేలో రోహిత్ కెప్టెన్ గా బరిలోకి దిగనున్నాడు.