నాని 'ప్యారడైజ్'.. టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

నాని 'ప్యారడైజ్'.. టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

Nani The Paradise Telangana government green signal for ticket price hike
  • నాని ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక అనుమతులు
  • టికెట్ ధరల పెంపు, రోజుకు ఐదు షోలకు గ్రీన్ సిగ్నల్
  • విడుదలకు ఒక రోజు ముందే ప్రత్యేక ప్రీమియర్ షో
  • నిర్మాతలు రూ.1 కోటి విరాళం ఇవ్వాలనే షరతు విధింపు
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 24న సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షోకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ. 500గా నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 24 నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు రూ. 95, ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ. 45 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అదేవిధంగా, సింగిల్ స్క్రీన్లలో మొదటి నాలుగు రోజులు రూ. 48, తర్వాతి ఆరు రోజులు రూ. 23 చొప్పున అదనంగా పెంచుకోవడానికి అనుమతించారు.

అయితే, ఈ అనుమతులకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. నిర్మాతలు తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి రూ. 1 కోటి విరాళంగా అందించాలి. దీంతో పాటు, సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన సందేశాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను ఆదేశిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు. 
Advertisement
Nani
The Paradise movie
Srikanth Odela
Telangana ticket price hike
The Paradise extra shows
Nani new movie updates

More Telugu News