నిర్మలా సీతారామన్ అన్నీ అబద్ధాలే చెప్పారు: హరీశ్ రావు

Harish Rao fires on Nirmala Sitharaman
  • కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదన్న హరీశ్ రావు
  • పేదలకు మేలు చేసే ఒక్కటి కూడా లేదని విమర్శ
  • మెడికల్ కాలేజీలు కేటాయించాలని డిమాండ్
కేంద్ర బడ్జెట్ లో ఏమీ లేదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పేదలకు మేలు చేసే ఒక్కటి కూడా బడ్జెట్ లో లేదని చెప్పారు.  రైతులు, మహిళలు, కులవృత్తుల గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గురించి హైదరాబాద్ దూరదర్శన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నీ అవాస్తవాలే మాట్లాడారని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది నూటికి నూరు పాళ్లు నిజమని చెప్పారు. ప్రతి మాటను పూర్తి ఆధారాలు, లెక్కలతో మాట్లాడారని చెప్పారు. తెలంగాణపై కేంద్రానికి నిజంగా ప్రేమ ఉంటే మెడికల్ కాలేజీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 1.25 లక్షల కోట్ల నిధులను విడుదల చేయాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంక్రమించిన అన్నింటినీ కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertisement
Harish Rao
TRS
Nirmala Sitharaman
BJP

More Telugu News