మేం వచ్చాక స్కూళ్లలో హిందూ విద్యార్థులకు బొట్టు తప్పనిసరి చేస్తాం: బండి సంజయ్
- సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు ఇచ్చిన హోంవర్క్‌పై వివాదం
- కల్మా, ఫతేహా, సూరా చదవాలంటూ డైరీలో హోంవర్క్ రాసిన వైనం
- టీచర్‌ను తొలగించినట్లు వెల్లడించిన యాజమాన్యం
- బీజేపీ అధికారంలోకి వస్తే హిందూ సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్న బండి
- సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చారన్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతిపై బలవంతంగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదవాలని ఆదేశించడం దుర్మార్గమని విమర్శించారు. సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సెక్యులర్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
సైదాబాద్‌లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ డైరీలో ఈ హోంవర్క్ రాసినట్లు చెబుతున్నారు. మరోవైపు, కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇలాంటి ఘటన తమ పాఠశాలలో ఇదే తొలిసారి జరిగిందని వివరణ ఇచ్చింది.
ఈ ఘటనపై బీజేపీ నేతలు స్కూల్‌ను ముట్టడిస్తామని హెచ్చరించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్కూల్‌కు వెళ్లే మార్గాలను మూసివేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తెలంగాణలోని కొన్ని పాఠశాలలు హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని చిన్నారులను ఇస్లాం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పాఠశాలలు, ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని జైలుకు పంపాలని అన్నారు.