శ్రీవారిని కోరిక కోరిన 3 రోజులకే అద్భుతం జరిగింది: తిరుమలలో ఆసక్తికర విషయం చెప్పిన అయ్యన్నపాత్రుడు
- శ్రీవారిని కోరుకున్న 3 రోజులకే కుమారుడికి రాజ్యసభ సీటు వచ్చిందన్న స్పీకర్ అయ్యన్న
- వన్యప్రాణి సంరక్షణ కమిటీ ఛైర్మన్‌గా తిరుపతి జూపై సమీక్షకు శ్రీకారం
- సౌకర్యాల లేమితో తిరుపతి జూకు భారీగా తగ్గిన సందర్శకుల సంఖ్య
- టీటీడీ సహకారంతో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడి
- జూలో సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టీకరణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తన రాజకీయ జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్వామి వారిని తాను మనస్ఫూర్తిగా ఓ కోరిక కోరుకోగా, అది కేవలం మూడు రోజుల్లోనే నెరవేరిందని ఆయన తెలిపారు. అదే సమయంలో, ఏపీ అసెంబ్లీ వన్యప్రాణి సంరక్షణ కమిటీ ఛైర్మన్‌గా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అభివృద్ధికి తన కార్యాచరణను వివరించారు.
నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. గతంలో తాను స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఇంకా జరగలేదని గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో మీడియా మిత్రులు నన్ను ఏం కోరుకున్నారని అడిగారు. నా కుమారుడు విజయ్‌కు రాజ్యసభ సీటు రావాలని మొక్కుకున్నట్లు చెప్పాను. ఆశ్చర్యంగా, నేను ఇక్కడి నుంచి వెళ్లిన మూడో రోజే అతనికి రాజ్యసభ సీటు ఖరారైంది. అదంతా ఆ స్వామివారి దయ, ప్రజల ఆశీర్వాదమే" అని అయ్యన్నపాత్రుడు వివరించారు.
అనంతరం తన అధికారిక హోదాలో తిరుపతి జూపార్క్ అభివృద్ధిపై ఆయన మాట్లాడారు. తాను 'ఏపీ అసెంబ్లీ వన్యప్రాణి - పర్యావరణ పరిరక్షణ కమిటీ'కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని, ఈ కమిటీలో ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, నరేంద్ర వర్మ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం జూను సందర్శించామని, ఇప్పుడు తిరుపతి జూను పరిశీలించి ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.
ఆసియాలోనే సుమారు 3 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద జూ పార్క్ తిరుపతిలో ఉందని, కానీ దీనికి ఆదరణ కరవైందని అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రతిరోజూ దాదాపు 90 వేల మంది భక్తులు తిరుమల వస్తుంటే, వారిలో కేవలం 3 వేల మంది మాత్రమే జూను సందర్శిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడమే" అని ఆయన పేర్కొన్నారు. జూపార్క్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సందర్శకులను ఆకట్టుకునే ఏర్పాట్లు కొరవడ్డాయని అన్నారు.
ఈ సమస్యల పరిష్కారానికి టీటీడీ సహకారం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. తిరుమలకు వచ్చే భక్తుల్లో కనీసం సగం మంది జూకు వచ్చినా, ఆదాయం పెరిగి పార్క్ నిర్వహణ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. జూలో మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి, నిధులు ఎలా సమకూర్చాలనే అంశాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్‌తో సమావేశమై చర్చిస్తామన్నారు. తిరుపతికి వచ్చే కుటుంబాలు సరదాగా జూకు వచ్చి సేద తీరేలా, ఆనందంగా గడిపేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే తమ కమిటీ లక్ష్యమని ఆయన వివరించారు.