'మైడియర్ బ్రదర్ సుమన్' అంటూ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మైడియర్ బ్రదర్ సుమన్' అంటూ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi congratulates Suman on the occasion of completion of 45 years in film industry
  • సినీ పరిశ్రమలోకి సుమన్ అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి
  • అభినందనలు తెలియజేసిన చిరంజీవి
  • 700కు పైగా చిత్రాల్లో నటించడం అంటే ఆషామాషీ కాదని వ్యాఖ్య
ప్రముఖ సినీ నటుడు సుమన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఒక వీడియో ద్వారా ప్రత్యేకంగా గ్రీటింగ్స్ చెప్పారు. మైడియర్ సుమన్ సినీ పరిశ్రమలో నీవు 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చిరు అన్నారు. 

ఈ సందర్భంగా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. సినిమాలపై నీకున్న కమిట్మెంట్ ఏమిటో నీవు నటించిన చిత్రాలే చెపుతాయని కితాబిచ్చారు. 10 భాషల్లో 700కు పైగా చిత్రాల్లో నటించడం అంటే ఆషామాషీ కాదని అన్నారు. ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే లక్షలాది ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తావని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ నెల 16న బెంగళూరులో జరగబోయే నీ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుమన్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరులో వేడుక నిర్వహిస్తున్నారు.
Advertisement
Suman
Chiranjeevi
Tollywood

More Telugu News