రామ్ చరణ్ ను చూసి తీవ్ర భావోద్వేగాలకు గురైన బాలుడు... వీడియో ఇదిగో!
- రామ్ చరణ్ ను చూసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుడు
- తన అభిమాన హీరోను చూశాక కన్నీటిపర్యంతం
- వివరాలు అడిగి తెలుసుకున్న రామ్ చరణ్
- అతడిని క్షేమంగా ఊరికి పంపించాలంటూ సిబ్బందికి సూచన
ఆ కుర్రాడిని రామ్ చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడు తిరిగి తన స్వస్థలానికి వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ తన సిబ్బందికి పురమాయించారు. అంతేకాదు, ఆ బాలుడితో ఫొటో దిగి సంతోషపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.