కాక్రోచ్ పార్టీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండే చేతికి.. ఎవరీ నేత?
- సీజేపీ ఉద్యమ బాధ్యతలు అజింక్య షిండేకు అప్పగింత
- 35 ఏళ్ల షిండే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్
- గతంలో పుణెలో ఐటీ ఉద్యోగిగా పనిచేసిన షిండే
- ఆప్ మహారాష్ట్ర విభాగంలో కీలక బాధ్యతలు
- ఆగస్టులో సీజేపీ జాతీయ బృందంలోకి షిండే
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్యమ బాధ్యతలు అజింక్య షిండే చేతికి వచ్చాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన నిరసనలను ఇకపై ఆయనే నడిపించనున్నారు. మహారాష్ట్రకు చెందిన షిండే.. దీప్కేకు అత్యంత సన్నిహితుడు.
తనను, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను పోలీసులు అరెస్టు చేస్తే ఉద్యమాన్ని షిండే ముందుకు తీసుకెళ్తారని దీప్కే ఓ వీడియోలో ప్రకటించారు. ఆయన సూచనల మేరకు షిండే నిరసనకారులకు పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్ చేరుకోవాలని, పోలీసులు ఎక్కడ అడ్డుకున్నా అక్కడే నిరసన కొనసాగించాలని కోరారు. తమ ఐక్యతను చూసి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు.
ఎవరీ అజింక్య షిండే?
మహారాష్ట్రకు చెందిన అజింక్య షిండే వయసు 35 ఏళ్లు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందిన ఆయన.. పుణెలోని ఓ అంతర్జాతీయ ఐటీ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరారు. ఆయన తల్లిదండ్రులు తొలుత అలీబాగ్‌లో వ్యవసాయం చేసేవారని, తర్వాత లాతూర్‌కు వెళ్లి స్థిరపడ్డారని కథనాల ద్వారా తెలుస్తోంది.
2016లో గోవాలో దీప్కేతో షిండేకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఆప్‌లో పింప్రి-చించ్‌వాడ్ కన్వీనర్‌గా పనిచేసిన షిండే.. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పనిచేశారు. అనంతరం ఆప్ మహారాష్ట్ర విభాగంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా, యువజన విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఈ ఏడాది ఆగస్టులో షిండేను దీప్కే సీజేపీ జాతీయ బృందంలోకి తీసుకున్నారు. జాతీయ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. సన్నిహితులకు దీప్కే పెద్దపీట వేస్తున్నారని గుజరాత్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు ఆరోపించారు.
ప్రస్తుతం పార్టీ అగ్రనేతలైన దీప్కే, రంకా, దాస్ తర్వాతి స్థానంలో షిండే ఉన్నారు. జులైలో పేపర్ లీక్ నిరసనల్లో ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు వారంతా పోలీసుల అదుపులో ఉండటంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించే బాధ్యత షిండేపై పడింది.